- Advertisement -
న్యూఢిల్లీ : టమాటా ధరలు భారీగా పెరగడంతో ప్రజలు దీనివైపు చూసేందుకు కూడా సాహసించడం లేదు. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా వీటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ఇప్పుడు ఓ శుభవార్త వచ్చింది. టమాటా హోల్‌సేల్(టోకు) ధరలో 29 శాతం భారీ క్షీణత నమోదైంది. దీనితో పాటు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని అనేక కేంద్రాలలో ప్రభుత్వం టమాటాలను కిలో రూ.90 చొప్పున విక్రయిస్తోంది.
ఢిల్లీలో తక్కువ ధరకు టమాట విక్రయాలు కొనసాగుతున్నాయి. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ ప్రకారం, జూలై 16న టమాటా టోకు ధర క్వింటాల్‌కు రూ.10,750 నుండి రూ.7,575కి తగ్గుముఖం పట్టింది. అంటే టమాట టోకు ధరలో 29 శాతం తగ్గింపు వచ్చింది. గత కొన్ని రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో టమాటా ధర కిలో రూ. 220 వరకు చేరింది. దీంతో కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణ ప్రజలకు
- Advertisement -