Saturday, November 23, 2024

ఎవరికి ఓటేసినా..బిజెపికే

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
భగ్గుమన్న సొంత పార్టీ నేతలు, విపక్షాలు

మన తెలంగాణ/ హైదరాబాద్/ నిజామాబాద్ సిటీ : ఎవరికి ఓటు వేసినా మాకే ప డుతుంది.. బిజెపినే గెలుస్తుంది అని పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఆవాస్ యోజన ద్వారా దేశ వ్యాప్తంగా 5 కోట్లఇండ్లు నిర్మిస్తామని హామీఇచ్చా ము.. ఇప్పటికే మూడున్నర కోట్ల ఇండ్లు నిర్మించాం.. మరో 50 లక్షలు నిర్మాణ దశలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పేదలకు గృహ నిర్మాణాల్లో తెలంగాణ సర్కారు చాలా వెనుకబడింది.. పేదలకు డబుల్ బెడ్ రూమ్స్.. ఆశ చూపి వారిని మభ్యపెడుతున్నారని అర్వింద్ ఆరోపించారు.

ముస్లిం మైనారిటీల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చిందని.. బిజెపికి ఓట్లు వేసి తమ పనితీరును పరిశీలించాలని ఆయన కోరారు. ముస్లింలు కాంగ్రెస్‌కు వేసిన, బిఆర్‌ఎస్‌కు వేసిన లే దా నోటాకు వేసిన మళ్ళీ గెలిచేది మోడీయేనని స్పష్టం చేశారు. యుపిలో అనేక ని యోజకవర్గాల్లో ముస్లింలు బిజెపికి ఓట్లు వేసి గెలిపించారని ఆయన పేర్కొన్నారు. బిజెపికి ఓట్లు వేయడం ఇష్టం లేకపోతే నోటాకు వేయాలని ఆయన కోరారు. యుపిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లలో ముస్లింల కన్నా హిందువులు ఎక్కువ మంది చనిపోయారని ఆయన గుర్తుచేశారు. 15 శాతం ఉన్న దళితుల కోసం పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇస్తుందని అంతే జనాభా ఉన్న ముస్లింలకు కేవలం లక్షా రూపాయల సహాయం చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు లక్ష్మినర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
మరోసారి నోరు జారిన అర్వింద్..
ఎంపి అర్వింద్ మరోసారి నోరు జారారు. నిత్యం వివాదాల్లో ఉం డే ఆయన.. తాజాగా బుడబుక్కల కులాన్ని తక్కువ చేసి మాట్లాడారు. మంత్రి కెటిఆర్‌ను దూషిస్తూ బుడబుక్కల పదం వాడారు. ఆ తర్వాత నోరు జారిన విషయం గమనించి బుడబుక్కల కులా న్ని కించపర్చేందుకు తాను ఆ మాట అనలేదని మాట మార్చారు. ఎన్నికల్లో కారుకు ఓటేసినా, కాంగ్రెస్‌కు ఓటేసినా ఇంకా ఎవరికి వేసినా బిజెపి పువ్వు గుర్తుకే పడుతుందని వ్యాఖ్యానించారు. దీంతో ఎన్నికల వ్యవస్థపైనే అనుమానాలు కలిగేలా మాట్లాడిన అర్వింద్ తీరుపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News