Wednesday, January 22, 2025

భారత్‌లో విమానయాన సంస్థలు ఎందుకు దెబ్బతింటున్నాయి?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత గగనతలంలో ఈ వారం గో ఎయిర్‌లైన్స్ ఇండియా బలిపశువు అయింది. ఇది విఫలం చెందిన హైప్రొఫైల్ క్యారియర్ కాదు అలాగని చివరిదీ కాదు. అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతి విమానయానం కోసం భారతీయ విమానయాన సంస్థలు గత కొన్ని సంవత్సరాలుగా బిలియన్ల డాలర్ల విలువైన విమానాలను ఆర్డర్ చేశాయి. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంలో పోటీ పడుతున్నాయి. కరోనా మహమ్మారితో పరిశ్రమ కుప్పకూలిపోకముందే, మనుగడ కోసం తీవ్రంగా పోటీ పడుతూ ఉంది.

ఒకప్పుడు దేశంలో మూడవ అతిపెద్ద క్యారియర్ అయిన గో దివాలా రక్షణ కోరింది. ప్రాట్ అండ్ విట్నీ తన ఫ్లీట్ వెన్నెముకగా ఉన్న ఎయిర్‌బస్ ఎ320నియో జెట్‌లకు అవసరమైన విడిభాగాలు, రీప్లేస్‌మెంట్ ఇంజిన్‌లను సరఫరా చేయడంలో విఫలమైంది. మధ్యవర్తిత్వ కోర్టు విమానాలను సగం తగ్గించుకునేలా బలవంతపెట్టినప్పటికీ, ఇంజన్ తయారీదారు, రేథియాన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ తన దావాను వివాదం చేసింది. గో ఎయిర్‌లైన్స్ గతంలోనూ నిలదొక్కుకునేందుకు కష్టపడింది. ఇప్పుడు కూడా తన ప్రత్యర్థి కంపెనీ అయిన ఇండిగో కంటే చాలా నెమ్మదిగా వృద్ధి చెందుతోంది. దేశీయ విమానయాన రంగంలో ఇండిగో నియంత్రణ ఉంది.

విజయ్ మాల్యా స్థాపించిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బ్యాంకులు, సిబ్బంది, లీజర్లు, విమానాశ్రయాలకు బకాయిలు చెల్లించడంలో విఫలం కావడంతో 2012లో తన కార్యకలాపాలను నిలిపేసింది. ట్రావెల్ ఏజెంట్‌గా మారిన బిలియనీర్ నరేశ్ గోయెల్‌కు చెందిన జెట్ ఎయిర్‌వేస్ ఇండియా లిమిటెడ్ 2019లో దివాలా తీసినప్పటి నుంచి ఎగురలేదు. ఎయిర్ కోస్టాతో సహా ఇటీవలి సంవత్సరాలలో చిన్న ప్రాంతీయ వాహకాలు కూడా ముడుచుకున్నాయి. ఇది 2014లో విమానయాన రంగాన్ని ఆశ్చర్యపరిచిన ఎయిర్ కోస్టా 2017లో 2.9 బిలియన్ డాలర్ల విలువైన 50 ఎంబ్రేయర్ ఎస్‌ఎ జెట్‌ల కోసం ఆర్డర్ ఇచ్చింది.

భారతీయ విమానయాన సంస్థలు ముడుచుకుపోవటానికి కారణాలు మారుతూ ఉంటాయి. చౌకైన ఫేర్స్, ఇంధనంపై అధిక పన్నులు, నువ్వానేనా అన్న పోటీ వంటివన్నీ కోవిడ్ కాలం నుంచి రెట్టింపయ్యాయి. ఆదివారం న్యూఢిల్లీ నుంచి ముంబయికి 90 నిమిషాల వైమానిక ప్రయాణానికి బుకింగ్ డాట్ కామ్ 79 డాలర్లు వసూలు చేస్తోంది. అయితే న్యూయార్క్ నుంచి అట్లాంటాకు ఇదే నిడివి గల విమానయానానికి 199 డాలర్లు. భారత దేశంలోని కొన్ని రాష్ట్రాలు జెట్ ఇంధనంపై 30 శాతం మేరకు ప్రాంతీయ పన్నులను విధిస్తున్నాయి. ఇది నోఫ్రిల్స్ బ్రాండ్‌ల ఖర్చులలో సగం కంటే ఎక్కువ. ఇండిగో వంటి పెద్ద ప్లేయర్స్ పోటీని ప్రత్యర్థి విమానయాన సంస్థలు తట్టుకోలేకపోతున్నాయి. దీనికితోడు 2019 నుంచి డాలరుతో పోల్చినప్పుడు భారత కరెన్సీ దాదాపు 20 శాతం పడిపోయింది. తద్వారా విదేశాల నుంచి విమానాలను లీజుకు తీసుకునే ఖర్చు పెరిగిపోయింది. దేశంలో ఏ ప్రభుత్వమున్నా కొట్టుమిట్టాడుతున్న వైమానిక కంపెనీలను ఆదుకునే పనయితే చేచలేదు. కోవిడ్ మహమ్మారి కాలంలో మోడీ ప్రభుత్వం విమాన సంస్థలకు క్రెడిట్ లైన్స్‌ను ఆఫర్ చేసిందే తప్ప, బెయిలవుట్స్ ఇవ్వలేదు. పైగా ఆయన నిరంతరం నష్టాల్లో నడుస్తున్న ఎయిర్ ఇండియా లిమిటెడ్‌ను టాటా గ్రూప్‌కు అమ్మేసింది. ఆయన వచ్చే ఏడాది మూడోసారి ఎన్నికలకు వెళుతున్నారు.క్రెడిట్‌పై ఇంధనం ఇవ్వడానికి స్థానిక ఆయిల్ కంపెనీలు నిరాకరించడంతో కోటీశ్వరుడు కళానిధి మారన్‌కు చెందిన స్పైస్ జెట్ లిమిటెడ్ మొత్తం విమానాలను నడపడం ఆపేయాల్సి వచ్చింది. అయితే కోఫౌండర్ అజయ్ సింగ్ నేతృత్వంలో స్పైస్ జెట్ విమానాలు నడుస్తున్నాయి.

ఎయిరిండియా ప్రైవేటీకరణ ఏకీకరణకు దారితీసింది. టాటా గ్రూప్ తన లోకల్ వెంచర్లయిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్, క్యాపిటల్ ఎ బిహెచ్‌డి యొక్క ఎయిర్ ఏషియా ఒకే ఛత్రం కిందికి వచ్చేస్తున్నాయి. భారత్‌లో ఏ విమానయాన సంస్థ నిలదొక్కుకుంటుందన్న దానికి ఎలాంటి గ్యారంటీ లేదు. బడ్జెట్ క్యారియర్ ఎయిర్ సహారాను కొనుగోలు చేసిన జెట్ ఎయిర్‌వేస్, అలాగే ఎయిర్ డెక్కన్‌ను స్వాధీనం చేసుకున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రెండూ దివాలా తీశాయి.
గో ఎయిర్‌లైన్స్ విషయానికొస్తే, పర్యవేక్షించడానికి కోర్టు ఓ అధికారిని నియమించొచ్చు. అయితే రుణదాతలు, లీజర్లతో మళ్లీ చర్చిస్తారు. ఈ ఎయిర్‌లైను కోలుకుంటానని పట్టుబడుతోంది. కానీ మే 9 వరకు అన్ని విమానాలను రద్దు చేసింది. ఈ సమయంలో, వైమానిక సంస్థ తన శిక్షణ పొందిన ఉద్యోగులను, సిబ్బందిని ప్రత్యర్థులకు కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News