Monday, December 23, 2024

మరో ఛాన్స్ ఎందుకు?.. బైడెన్ పట్ల డెమోక్రాట్ల స్పందన

- Advertisement -
- Advertisement -

లాకోనియా : అమెరికా అధ్యక్షపదవికి తిరిగి పోటీచేయాలనే తపన బైడెన్‌కు ఉన్నా ఇది అంత తేలిక అయ్యే పనికాదని స్పష్టం అవుతోంది. 2024 చివరిలో అమెరికా ప్రెసిడెంట్ పదవికి ఎన్నిక జరుగుతుంది. అధికార డెమోక్రాట్లు కొందరు బైడెన్ తిరిగి అధ్యక్ష బరిలోకి దిగడానికి అంగీకరించడం లేదు. ఒక్క సారి అధ్యక్ష స్థానంలో ఉన్నాడు ఇక చాలు. ఒక్క టర్మ్‌తో ముగిస్తే ఇతరులకు అవకాశం దక్కుతుంది కదా అని పార్టీకి చెందిన స్టీవ్ షర్ట్‌లెఫ్ తెలిపారు. 2019 ఎన్నికల దశలో స్టీవ్ ఎప్పుడూ బైడెన్ వెన్నంటి ఉన్నారు. నామినేషన్ పత్రాల దాఖలు దశ నుంచి ప్రచార ఘట్టం, ఆ తరువాత విజేతగా బైడెన్ ఎన్నిక వరకూ బైడెన్ వెంటనే తిరిగారు.న్యూ హాంప్‌షైర్‌కు చెందిన ఈ డెమోక్రాట్ నేత ఈ ప్రాంతానికి చెందిన నాలుగు ఎలక్టోరల్ ఓట్లు బైడెన్‌కు పడేలా చూసుకున్నారు. అయితే తిరిగి ఇప్పుడు దేశంలో అధ్యక్ష ఎన్నికల ప్రస్తావనల దశలో షర్ట్‌లెఫ్‌తో పాటు పలువురు డెమోక్రాట్లు ఒక్క నేత ఒక్క పర్యాయం పాటపాడుతున్నారు.

బైడెన్ తిరిగి పోటీకి దిగవచ్చునా అని విలేకరులు ప్రశ్నించగా డెమోక్రాట్లలో చాలా మంది తమకు అయితే ఇష్టం లేదని చెపుతున్నారు. బైడెన్ తిరిగి అధ్యక్ష పోటీకి దిగవచ్చా లేదా అనే విషయంపై గత నెలలో ఓ సర్వే జరిగింది. ఇందులో 37 శాతం మంది డెమోక్రాట్లు బైడెన్ పోటీ పట్ల సుముఖత వ్యక్తం చేశారు. గత ఏడాది జరిగిన మిడ్‌టర్మ్ ఎన్నికల దశలో వ్యక్తం అయిన 52 శాతం అనుకూల ఓటు ఈ విధంగా దిగజారింది. పలువురు బైడెన్ వృద్థాప్యం దీని వల్ల తలెత్తుతున్న సమస్యలు, అంతర్జాతీయ స్థాయిలో అధినేత ఆరోగ్య పరిస్థితిపై వెలువడే స్పందనలు వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. విధానపరంగా కూడా బైడెన్ అధికార యంత్రాంగం చాలా పొరపాట్లకు దిగుతోందని, ప్రత్యేకించి అఫ్ఘనిస్థాన్ నుంచి గందరగోళం నడుమ అమెరికా సేనల నిష్కృమణ వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇక పార్టీలోని అభ్యుదయవాదులు ఎక్కువగా బైడెన్ తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలు విజయాలు సాధించారని బైడెన్‌ను ఆయన మద్దతుదార్లు కొనియాడుతూ ఉన్నా, ఈ మితవాది హయాంలో దేశానికి పెద్దగా ఒరిగిందేమీ లేదని వాదన విన్పిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News