ముంబై: ఇప్పటికీ సుప్రీంకోర్టులో శివసేన చిక్కుముడి వీడనేలేదు. కానీ ఉద్ధవ్ ఠాక్రే, షిండే వర్గీయుల మధ్య మాత్రం కుతకుత అలాగే ఉంది. వీలుచిక్కినప్పుడల్లా ఒక వర్గం, మరో వర్గాన్ని విమర్శిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే నోరు విప్పారు. ఠాక్రేలను కలుసుకోవడం పెద్ద సమస్య అన్న ఆరోపణను ఖండించారు. “నేనెల్లప్పుడూ అందుబాటులోనే ఉన్నాను. ఒకవేళ మీరు ఏక్‌నాథ్ వర్గంలోకి గెంతాలనుకుంటే రాజీనామా ఎందుకు చేయలేదు? సాధారణంగా ప్రజాస్వామ్యంలో వేరే గ్రూపులో చేరాలనుకుంటే ఎన్నికల్లో పోటీ చేసి వేరే గ్రూపులోకి పోవాలి కదా? మేము మీకు ప్రేమ, నమ్మకాన్ని ఇచ్చినప్పుడు మీరు ఎందుకు వెన్నుపోటు పొడిచారు? శివసేనలోని 55 ఎంఎల్‌ఏలలో 39 మంది షిండే వర్గంలో చేరడం వల్ల మహా వికాస్ అఘడి ప్రభుత్వం గత ఏడాది జూన్‌లో కూలిపోయింది” అన్నారు.
ఆదిత్య ఠాక్రే బిజెపిషిండే ప్రభుత్వాన్ని సవాలు చేస్తూ ‘ఇప్పుడు బిఎంసి ఎన్నికల్లో పోటీపడండి, సమస్య ఏమిలేదు. రాజీనామా చేసి మరీ ఎన్నికల్లో ఎదుర్కొండి. మేము కూడా ప్రజా తీర్పును ఆమోదిస్తాము, ముంబై వాసులకు మేమేమిటో బాగా తెలుసు. మేము అధికారంలో ఉన్నప్పుడు పురపాలక సమస్యలను తీర్చాము. గృహ, నాణ్యమైన విద్య, ఆరోగ్యం, రోడ్లు, ప్రజా రవాణ మీద మేము దృష్టి పెట్టాము. ప్రతి వారం నేను సమావేశాలు జరిపేవాడిని” అని చెప్పుకొచ్చారు.
వారు మమ్మల్ని వెన్నుపోటు పొడిచారు: ఆదిత్య థాక్రే
- Advertisement -
- Advertisement -
- Advertisement -