Wednesday, January 22, 2025

కెసిఆర్ అవినీతి తెలిసినా మోడీ ఎందుకు చర్యలు తీసుకోలేదు

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అత్యంత అవినీతి ప్రభుత్వమని సాక్షాత్తు దేశప్రధాని నరేంద్రమోడీ వరంగల్ సభా వేదికగా వెల్లడించారని అయితే అన్నీ తెలిసినా చర్యలు ఎందుకు చేపట్టలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ఆదివారం నేరెడుచర్లలో టీడీపీ అద్యక్షులు పొనుగోటి జంగయ్య మాతృమూర్తి వజ్రమ్మ ఇటీవల స్వర్గస్తులు కాగా ఆయన గృహానికి వెల్లి పరామర్శించిన అనంతరం నేరెడుచర్ల సీపీఎం పార్టీ కార్యాలయం అరిబండి భవన్‌లో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

నిఘా సంస్ధలక్ష్మీ కేంద్రం ఆదీనంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న అవినీతిపై చ ర్యలు చేపట్టకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. బీజెపీ పార్టీకి వ ంతపాడితే ఎంత పెద్ద అవినీతి పరులైనా నీతివంతులుగా మారతారన్నారు. లక్షల కోట్లు అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన కార్పోరేట్ శక్తులకు రాయితీలు కల్పిస్తున్నారన్నారు. మోడీ ప్రధాని కాకముందు 50 నుండి 60వేల కోట్లు ఉన్న అదాని ఆస్తులు నేడు 11లక్షల కోట్లకు చేరాయన్నారు. 60,70సంవత్సరాలు గా ప్రజలు కాపాడుకుంటున్న ప్రభుత్వ రంగ ఆస్తులను అమ్ముకోవడం, లీజుకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.

నిరుద్యోగ సమస్యలను గాలికి వదిలేసి కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చారన్నారు. బీజెపి ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడు తుందన్నారు. తెలంగాణరాష్ట్రం లో బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు ప్రజాస్వా మ్య పద్దతిలో పాలన చేపట్టినప్పుడే మరోసారం అధికారంలోకి వస్తారని హితవు పలికారు. ఈసమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు కే.నగేష్, మల్లు గౌతమ్‌రెడ్డి, కే.తిరపతయ్య, మండల,పట్టణ కార్యదర్శులు సిరికొండ శ్రీను, కొదమగుండ్ల నగేష్, సీఐటీయు మండల కన్వీనర్ నీలా రాంమూర్తి లున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News