Friday, December 20, 2024

ప్రచారానికి అక్కడికి ఎందుకెళ్ళలేదు ?

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ అగ్రనేతలకు ఎంఐఎం సూటి ప్రశ్న

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్, ఎంఐఎం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారం ముగింపు రోజు కూడా ఎంఐఎం లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం తీవ్రంగా ఖండించింది. బిజెపి చెప్పినట్లుగా ఎంఐఎం నడుచుకుంటోందని ఆ పార్టీ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలో బిజెపినే నిర్ణయిస్తోందని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తున్నారు. మంగళవారం నాంపల్లి కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంధీ మరోసారి ఎంఐఎంను టార్గెట్ చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ నేపథ్యంలో మజ్లిస్ ట్విట్టర్ వేదికగా స్పందించింది. తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారానికి వచ్చిన రాహుల్, ప్రియాంక గాంధీలు గోషామహల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తరపున ఎందుకు ప్రచారం చేయలేదని ఎంఐఎం ప్రశ్నించింది. గోషామహల్‌లో బిజెపితో ఏదైనా సెట్టింగ్ జరిగిందా? అని ఆ పార్టీ నిలదీసింది. కాగా గోషామహల్ లో బిజెపి తరపున రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం కోసం పోరాడుతుండగా కాంగ్రెస్ తరపున సునీతా రావు ఎన్నికల బరిలో ఉన్నారు.  ఇక్కడ ఎలాగైనా గెలవాలని బిఆర్‌ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. రాజాసింగ్‌పై నిత్యం విమర్శలు చేసే అసదుద్దీన్ గోషామహల్‌లో మాత్రం తమ అభ్యర్థిని బరిలో నిలపలేదు. దీంతో ఇప్పటికే ఎంఐఎం విమర్శల పాలయ్యింది. దీనికి అసదుద్దీన్ అనేక సార్లు సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News