Tuesday, November 5, 2024

నియంతల పేర్లన్నీ ‘ఎం’తోనే మొదలౌతాయెందుకో?

- Advertisement -
- Advertisement -

'Why do so many dictators have names that begin with M?' :Rahul

 

మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ ఘాటు ట్వీట్

న్యూఢిల్లీ : కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రాజధాని ఢిల్లీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ లక్ష్యంగా చేసిన ట్వీట్ పెద్ద ఎత్తున వైరలవుతోంది. ప్రపంచ నియంతల పేర్లన్నీ ‘ఎం’ అనే ఆంగ్ల అక్షరంతోనే ప్రారంభం అవుతాయంటూ ట్వీట్ చేసి రాహుల్ దుమారాన్ని రేపారు. ఆయా నేతల పేర్లన్నీ ‘ఎం’ అనే ఆంగ్ల అక్షరంతోనే ఎందుకు మొదలవుతాయంటూ బుధవారం ట్వీట్ చేశారు. మార్కోస్ ముస్సోలినీ, మిలోసెవిక్, ముబారక్, మొబుటు, ముషారఫ్, మికోంబెరో పేర్లను రాహుల్ అందులో ఉదహరించారు.

అయితే కాంగ్రెస్ నేత మోతీలాల్ నెహ్రూ, మాజీ ప్రధాని మన్మోహన్ పేర్లు కూడా ‘ఎం’ తోనే మొదలవుతాయి కదా అంటూ కొంతమంది ప్రతి విమర్శ చేశారు. అలాగే మమతా బెనర్జీ, మాయావతి పేర్లను ప్రస్తావిస్తూ మరొకరు రాహుల్‌కి కౌంటర్ వేశారు. అసలు ప్రధాని నరేంద్రమోదీ పేరు ‘ఎన్’ తో కదా స్టార్ట్ అయ్యేదంటూ మరికొందరు రాహుల్‌పై విరుచుకు పడుతున్నారు. కాగా రైతు ఆందోళన నేపథ్యంలో వారికి మద్దతు పలుకుతున్న ట్విటర్ ఖాతాలను బ్లాక్ చేసిన అంశంతోపాటు, పోలీసులు ఏర్పాటు చేసిన మేకులు, బారికేడ్లకు సంబంధించి కూడా కేంద్రంపై రాహుల్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News