Tuesday, December 24, 2024

దేవాలయంలో గంట ఎందుకు కొడతాం?

- Advertisement -
- Advertisement -

పరమాత్మను మేల్కొల్పడానికేనా? అయితే, పరమాత్మ ఎన్నడూ నిద్రించడు. అలాగాకపోతే, మనం వచ్చామని చెప్పడానికా? సర్వం తెలిసిన ఆయనకు ఏమీ చెప్పనవసరం లేదు. ఆయన సన్నిధిలోకి ప్రవేశించడానికి అనుమతి కోరడం కోసమా? అది స్వగృహ ప్రవేశమే కాబట్టి అందుకు అనుమతి పొందాల్సిన అవసరం లేదు. అన్ని వేళలా తనను చేరుకునేందుకు పరమాత్మ మనల్ని ఆహ్వానిస్తూనే ఉంటాడు. మరి అలాంటప్పుడు గంట కొట్టడం ఎందుకు?

గంట మోగే సమయంలో ఉద్భవించే శబ్దాలు పవిత్రతకు సంబంధించిన శబ్దాలు. పరమాత్ముడికి విశ్వజనీయ చిహ్నమైన ‘ఓంకారాన్ని’ గంటానాదం ఉద్భవింపజేస్తుంది. మంగళాకారుడైన పరమాత్ముడి సాక్షాత్కారాన్ని పొందాలంటే ఈ పవిత్రత అంతః, బాహ్యకరణాల్లో నిక్షిప్తమై ఉండాలి.

అలాగే, సంప్రదాయబద్ధంగా పరమాత్మకు మనం హారతి ఇచ్చే సమయంలో కూడా గంటానాదాన్ని చేస్తాం. ఇందుకు కంచుగానీ, ఇతర సంగీత పరికరాలను కానీ వినియోగిస్తుంటాం. భక్తిప్రపత్తుల నుంచి, ఏకాగ్రత నుంచి మరియు అంతఃకరణ శాంతి నుంచి భగవత్ఆరాధకుడిని దూరం చేయడం లేదా విఘ్నం కలిగించే అపవిత్ర, అసంబద్ధ శబ్దాలు, వ్యాఖ్యల నుంచి ఈ గంటానాదం పరిరక్షిస్తుంది.

సంప్రదాయ పూజా సమయంలో గంటానాదం చేసేటప్పుడు నిత్యపూజను ఇలా మొదలుపెడతాం….
ఆగమార్థాంతు దేవానాం గమనార్థాంతు రాక్షసమ్కుర్వే గంధర్వమ్తంత్ర దేవతావాహ్న లక్ష్యం…
యథార్థమైన మరియు ఘనమైన శక్తులు నా ఇంట్లోకి, నా హృదయంలోకి ప్రవేశించేందుకు,రాక్షస, చెడు శక్తులను విడిచిపెట్టేందుకు, నా అంతఃకరణలో దైవత్వాన్ని ఆవహింపచేయడం కోసం ఈ గంటానాదాన్ని చేస్తున్నాను.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News