Sunday, November 17, 2024

సిబిఐ విచారణ అడగరేం?

- Advertisement -
- Advertisement -

కేంద్రానికి లేఖ రాస్తే 48 గంటల్లోగా సిబిఐ విచారణకు ఆదేశిస్తాం
కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి
బిఆర్‌ఎస్‌కు మేలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ : కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవినీతిపై సిబిఐతో విచారణ జరిపించడానికి ఎందుకు చర్య లు తీసుకోవడం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై సిబిఐ విచారణ కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయలని డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్‌కు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మేలు చేసే విధం గా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వే స్తోందని విమర్శించారు. తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్ర భుత్వం అని పేర్కొన్నారు. ఎంఐఎం మధ్యవర్తిత్వంతో మాజీ సిఎం ప్రస్తుత సిఎంల మధ్య అవగాహన కుదిరిందని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రులను విమర్శించిన సిఎం రేవంత్ రెడ్డి నేడు నిశ్శబ్దంగా ఎందుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. మేడిగడ్డ తదితర కుంభకోణాలపై దర్యాప్తు చేయించడంలో కాంగ్రెస్ జాప్యం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలపై గోప్యంగా ఉంటూ, తన అసమర్థతను బయటపెట్టిందన్నారు. కేంద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ ఎందుకు రాయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరిగిన అవినీతిపై కెసిఆర్ ప్రభుత్వం సిబిఐ విచారణకు అంగీకరించలేదని గుర్తు చేసిన ఆయన రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సిబిఐ రాష్ట్రంలోకి రాకుండా జీవో తెచ్చా రని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వం లేఖ రాస్తే కాళేశ్వరంపై 48 గంట ల్లోగా సిబిఐ విచారణకు ఆదేశించేలా మేము రికమండ్ చేస్తామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News