Thursday, December 12, 2024

ఇండియాలోనే ఈవిఎంలతో ఎన్నికలెందుకు: శరద్ పవార్

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట్రలో ప్రతిపక్ష మహావికాస్ అఘాడి(ఎంవిఏ) కూటమి నేతలు ఈవిఎం లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ సిపి నేత శరద్ పవార్ కూడా ఇదే  అంశంపై స్పందించారు.

షోలాపూర్ జిల్లాలోని మర్కద్వాడి గ్రామంలో యాంటీ-ఈవిఎం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈవిఎంలపై ప్రజల్లో విశ్వాసం లేదన్నారు. అయినా తప్పని పరిస్థితిలో ఓటేశారన్నారు. అమెరికా, ఇంగ్లాండ్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు సహా ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ఈవిఎం పోలింగ్ లేదని, అక్కడ అంతా బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నటుల వెల్లడించారు. భారత్ లో మాత్రమే ఈవిఎంల ద్వారా ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు. ఇదిలావుండగా మహారాష్ట్రలో ఈవిఎంలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఎంవిఏ ఎంఎల్ఏలు శనివారం అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయలేదు. కాగా వారు ఆదివారం తమ ప్రమాణస్వీకారం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News