Wednesday, November 13, 2024

బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావుకు తొందర ఎందుకు?

- Advertisement -
- Advertisement -

సోనియాగాంధీ ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతాం
ఆరు గ్యారంటీల అమలుకు సిఎం కృషి చేస్తున్నారు
పార్లమెంట్ ఎన్నికలో ఎక్కువ సీట్లు గెలవాలి
షర్మిల ఎపి రాజకీయాలకు సరిపోతారు

మనతెలంగాణ/హైదరాబాద్:  కాంగ్రెస్ హామీలను అమలు చేయడం లేదని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌ రావు ఆరోపిస్తున్నారని, అప్పుడే ఆయనకు తొందర ఎందుకని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ విమర్శించారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉండగా దళితులకు 3 ఎకరాలు భూమి, ఇంటికో ఉద్యోగం అన్నారు. వాటిలో ఏ ఒక్కటైనా నెరవేర్చారా? అని ఆయన ప్రశ్నించారు. తాము వచ్చి నెల రోజులు కాలేదు, తాము ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తామని, తొందరపడొద్దని విహెచ్ సూచించారు. సోనియాగాంధీ ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామన్నారు. ఆరు గ్యారంటీలు అమలుకు సిఎం కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.

సోమవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీలను జనంలోకి రేవంత్ బాగా తీసుకెళ్లారని ఆయన కితాబునిచ్చారు. అన్ని హామీలు అమలు చేస్తాం, ప్రజలు నమ్మాలని ఆయన అన్నారు. పార్లమెంట్ ఎన్నికలో ఎక్కువ సీట్లు గెలవాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్సార్ టిపి చీఫ్ వైఎస్ షర్మిలపై విహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎపి పాలిటిక్స్‌లోకి షర్మిల ఎంట్రీ ఇచ్చారని ఆయన చెప్పారు. షర్మిల ఎపి రాజకీయాలకు సరిపోతారని ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే ఫైట్ చేయాలని తాను గతంలోనే చెప్పానని ఎపిలో షర్మిల బాగా పని చేస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచి సోనియా గాంధీకి గిఫ్ట్‌గా ఇవ్వాలని ఇందుకు సమష్టిగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News