సెప్టెంబర్‌లో 7.41 శాతానికి చేరిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి
చేయలేకపోతున్న కేంద్రం, ఆర్‌బిఐ మరోసారి పెరగనున్న
వడ్డీ రేట్లు ఆగస్టులో క్షీణించిన పారిశ్రామిక ఉత్పత్తి
0.8% పడిపోయిన సూచీ
న్యూఢిల్లీ: ఆహార వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణ మళ్లీ పెరిగింది. సెప్టెంబర్‌లో ఇది 7.41 శాతం నమోదైంది. అంతకుముందు ఆగస్టులో ఇది 7 శాతంగా ఉంది. అంటే 0.41 శాతం పెరిగింది. మరోవైపు ఆగస్టు నెలలో పారిశ్రమిక ఉత్పత్తి 0.8 శాతం క్షీణతను నమోదు చేసింది. ఈమేర కు బుధవారం కేంద్ర గణాంకాల శాఖ నివేదిక ను వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ద్రవ్యోల్బణ రేటు పెరుగుదల కొనసాగుతోంది. రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా తొమ్మిదో నెలలో ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) పరిమితిని మిం చిపోయింది. ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టులో 7.62 శాతం నుండి సెప్టెంబర్‌లో 8.60 శాతానికి పెరిగింది. రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల ను చూస్తే మరోసారి రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచే అవకాశముందని నిపుణులు భావిస్తున్నా రు. ఆర్‌బిఐ రెపో రేటును ఇప్పటికే నాలుగు సార్లు 190 బేసిస్ పాయింట్లు పెంచింది.
0.8 శాతానికి క్షీణించిన ఐఐపి
ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) 0.8 శాతం క్షీణించింది. గతేడాది ఇదే నెలలో పారిశ్రామికోత్పత్తి 13 శాతంతో గరిష్ఠ స్థాయిలో ఉంది. డేటా ప్రకారం, 2022 ఆగస్టులో తయా రీ రంగం ఉత్పత్తి 0.7 శాతం తగ్గిపోయింది. మైనింగ్ ఉత్పత్తి 3.9 శాతం క్షీణించింది. అదే సమయంలో ఈ కాలంలో విద్యుత్ ఉత్పత్తి 1.4 శాతం పెరిగింది. 2020 ఏప్రిల్‌లో కోవిడ్-19 మహమ్మారి కారణంగా పారిశ్రామిక ఉత్పత్తిపై చాలా ప్రతికూల ప్రభావం పడింది.