Monday, November 25, 2024

దావూద్ ఇబ్రహిం భయంతోనే పారిపోయా:లలిత్ మోడీ

- Advertisement -
- Advertisement -

తాను భారత్‌ను విడిచి పారిపోవడం వెనుక గల అసలు కారణాన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) వ్యవస్థాపకుడు లలిత్ మోడీ వెల్లడించారు. 2010లో తాను భారత్‌ను వీడడానికి తాను ఎదుర్కొంటున్న న్యాపరమైన చిక్కులు కారణం కాదని, చంపేస్తానంటూ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహిం నుంచి వచ్చిన బెదిరింపులే కారణమని లలిత్ మోడీ ఇటీవల రాజ్ షమాజీ పాడ్‌కాస్ట్ ఫిగరింగ్ ఔట్‌కు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించారు. ప్రాణం తీస్తామంటూ బెదిరింపులు రావడంతోనే తాను దేశాన్ని విడిచి పెట్టానని లలిత్ మోడీ చెప్పారు. న్యాయపరమైన చిక్కులేవీ తాను దేశం విడిచి పెట్టడానికి కారణం కాదని ఆయన అన్నారు. దావూద్ ఇబ్రహిం నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని ఆయన చెప్పారు. మ్యాచ్‌లను ఫిక్స్ చేయాలని దావూద్ బాశించాడని, మ్యాచ్‌ల ఫిక్సింగ్‌కు తాను ఎట్టి పరిస్థితులలో అంగీకరించబోనని ఆయన అన్నారు.

అవినీతి వ్యతిరేక ప్రచారానికి తాను ప్రాధాన్యత ఇస్తానని, ఆట నిజాయితీగా ఉండడమే తనకు ముఖ్యమని లలిత్ చెప్పారు. ప్రాణ రక్షణ కోసం ఎయిర్‌పోర్టులో విఐపి ఎగ్జిట్ గేటు ఉపయోగించాలని తన వ్యక్తిగత బాడీగార్డు కోరేవాడని ఆయన చెప్పారు. తాను హిట్‌లిస్టులో ఉన్నానని, కేవలం 12 గంటలపాటు మాత్రమే రక్షణ ఇవ్వగలమని సీనియర్ పోలీసు అధికారులు తన బాడీగార్డుకు చెప్పడంతో తన పరిస్థితి దారుణంగా తయారైందని ఆయన వివరించారు. తాను ఏదో ఒకరోజు భారత్‌కు తిరిగి వెళతానని కూడా లలిత్ మోడీ తెలిపారు. రేపు ఉదయం తాను భారత్‌కు తిరిగి వెళ్లవచ్చని, చట్టపరంగా తాను భారత్‌కు పారిపోయిన నేరస్థుడిని కానని ఆయన స్పష్టం చేశారు. తనపైన ఏ కోర్టులో ఒక్క కేసు కూడా దాఖలు కాలేదని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News