Monday, December 23, 2024

రెండు నెలలు గడిచినా పాస్‌పోర్టుపై ఎందుకు నిర్లక్ష్యం ?

- Advertisement -
- Advertisement -
నగర పోలీసుల తీరుపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం

హైదరాబాద్ : తాను పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేస్తే రెండు నెలల గడిచినా నగరంలోని పోలీసులు పరిశీలించకపోవడంపై గోషామహాల్ శాసనసభ్యులు రాజాసింగ్ మండిపడ్డారు. మే 25న తాను దరఖాస్తు చేసుకున్నట్లు ఆదివారం ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నాలాంటి ప్రజాప్రతినిధి పరిస్ధితి ఈ విధంగా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. పోలీసులు ఎందుకు తన దరఖాస్తును పరిశీలించడం లేదంటూ ట్విటర్‌లో రాష్ట్ర డిజిపి, నగర కమిషనర్‌కు ట్యాగ్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News