- Advertisement -
హైదరాబాద్: దక్షిణాది తెలంగాణ కృష్ణా జలాలపై ఆధారపడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కృష్ణా ప్రాజెక్టులు, కెఆర్‌ఎంబి సంబంధిత అంశాలపై సభలో చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగించారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, కృష్ణ జలాలపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్షనేత ఫామ్‌హౌస్‌కు పరిమితమవుతారా?.. ఇంత కెసిఆర్ సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత కెసిఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదని అడిగారు. కెసిఆర్ అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ సభకు వస్తే… స్పీకర్ ఎంత సేపు మైక్ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఒక వ్యక్తిని కరీంనగర్ నుంచి తరిమికొడితే మహబూబ్‌నగర్ వాసులు ఎంపిగా గెలిపించారని గుర్తు చేశారు.
- Advertisement -