Thursday, February 20, 2025

ఛత్రపతి శంభాజీ గురించి స్కూళ్లో ఎందుకు చెప్పలేదు: ఆకాశ్ చోప్రా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ‘ఛావా’ సినిమాను దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించారు. ఫిబ్రవరి 14న విడదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో పాలకుడి పాత్రలో విక్కీ కౌశల్ అద్భుతంగా నటించగా ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక మందనా జీవించారు. ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటించారు. ఈ సినిమాపై టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇవాళే ఛావా సినిమా వీక్షించానని, ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి స్కూల్లో ఎందుకు లేదని ప్రశ్నించారు.

ఈ చిత్రంలో ధైర్యం, నిస్వార్థం, తన పనిపై అంకితభావంతో ఎన్నో విషయాలు కలిసిన గొప్ప కథ అని కొనాయాడారు. కానీ అక్బర్ గొప్ప నాయకుడు అని, న్యాయంగా పాలించిన చక్రవర్తి అని నేర్పించారని, ఢిల్లీలో ఓ పెద్ద రహదారికి ఔరంగజేబు రోడ్డు అని పేరు ఎలా పెట్టారని అడిగారు. దీనికి సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకాశ్ చోప్రా పోస్టుపై నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘మీరు చరిత్ర చదువలేదా? అని ఓ నెటిజన్ ప్రశ్నించడంతో చరిత్రలో నాకు 80 శాతం మార్కులు వచ్చాయి’ అని చోప్రా రిప్లై ఇచ్చారు. కొందరు ఆయన పెట్టిన పోస్టు మద్దతు తెలుపుతుండగా మరికొందరు వివాదస్పదం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

విడుదలైన తొలి రోజు చావా రూ.31 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు దాదాపుగా రూ. 121 కోట్లు వసూళ్ల వర్షం కురిపించినట్టు సినీ వర్గాలు వెల్లడించాయి. హిస్టారికల్ సినిమాకు ఈ విధంగా వసూళ్లు రావడంతో ఈ చిత్రం రికార్డు సృష్టించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 6670 షోలను ప్రదర్శిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News