Sunday, December 22, 2024

భర్త చనిపోయినా రేఖ సింధూరం ఎందుకు పెట్టుకొంటోంది?

- Advertisement -
- Advertisement -

ముంబై: రేఖ మంచి అందగత్తె, నటి అన్న గుర్తింపు పొందింది. ఆమె తన భర్త చనిపోయాక మళ్లీ పెళ్లి చేసుకోలేదు. కానీ సింధూరం పెట్టుకుంటోంది. అనేక సంవత్సరాలుగా దీనికి సమాధానం దొరకలేదు. 1980లో రిషి కపూర్, నీతూ సింగ్ పెళ్లి వేడుకల్లో రేఖ సింధూరం పెట్టుకుని కనిపించింది. అప్పట్లో అమితాబ్ బచ్చన్, జయా బాధూరి వంటి నటీనటులు కూడా ఆమె సింధూరం ధరించడం చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు దాని గురించి అడిగితే తాను సినిమా పాత్ర కోసం సింధూరం ధరించానని, తుడిచేయడం మరచిపోయానని అన్నారు. ఆమె తరచూ సింధూరంతో  అనేక సందర్భాల్లో కనిపిస్తుండడంతో చాలా మందికి కతూహలం కలగడంతో పాటు వదంతులు కూడా వ్యాపించాయి.

1982లో ‘ఉమ్రావ్ జాన్’ సినిమాకు రేఖకు నేషనల్ అవార్డు లభించింది. ఆ సందర్భంగా రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి ‘సింధూరం ఎందుకు పెట్టుకుంటున్నావు?’  అని అడిగారు. దానికామె ‘మా నగరంలో సింధూరం పెట్టుకోవడం ఫ్యాషన్’ అని జవాబిచ్చారు.

చాలా సంవత్సరాల తర్వాత 2008లో మళ్లీ అదే ప్రశ్న అడిగితే ఆమె ‘‘ ప్రజలేమనుకుంటారో అన్న బాధ నాకు లేదు. సింధూరం పెట్టుకుంటే నేను బాగా కనిపిస్తాను. సింధూరం నాకు అబ్బుతుంది’ అని సమాధానం ఇచ్చింది. రేఖ స్టయిల్, హుందాతనం అందరినీ ఆకట్టుకుంటాయి. ఇటీవల రేఖ ఐఐఎఫ్ఏ 2024 చిత్రోత్సవ కార్యక్రమంలో మెరిసిపోయింది. అంతేకాక గ్రూప్ డ్యాన్సర్ లతో కలిసి నృత్యం కూడా చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News