Monday, January 20, 2025

ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ఎందుకు స్పందిస్తున్నారు: మోడీ

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్: బిఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరిట లూటీ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా బిఆర్‌ఎస్ దారిలోనే లూటీ చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. కాళేశ్వరం విచారణకు కాంగ్రెస్ ముందుకు రావడం లేదని, కాంగ్రెస్ పార్టీ రాకుమారుడు ఎన్నికలు రాగానే విద్వేష విషం చిమ్ముతున్నారన్నారు. కాంగ్రెస్ రాకుమారుడి రాజగురువు మనల్ని రంగు ఆధారంగా విభజిస్తున్నారని, శరీర రంగును బట్టి మనం ఆఫ్రికన్లు అని మాట్లాడుతున్నారన్నారు. జోగులాంబ తల్లి పాదాలకు నమస్కరిస్తున్నానని, పాలమూరు సోదర, సోదరీమణులకు ప్రధాని నరేంద్ర మోడీ హృదయ పూర్వక నమస్కారాలు తెలిపారు. నారాయణ పేట జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు.

మహబూబ్‌నగర్ ప్రాంతానికి కృష్ణా, తుంగభద్ర నదుల ఆశీర్వాదం ఉందని, ఈ ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టుల కోసం వేల కోట్లు ఇచ్చినప్పటికీ సద్వినియోగం కాలేదని, దీంతో పాలమూరు ప్రజలు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ కాంగ్రెస్ నేతలు పాలమూరు ప్రాంతాన్ని తమ స్వార్థానికి వాడుకున్నారని దుయ్యబట్టారు. మోడీ గ్యారంటీ అంటే అభివృద్ధి, దేశ భద్రత, విశ్వవేదికపై భారత గౌరవానికి గ్యారంటీ అని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్‌కు నిర్ధారించే ఎన్నికలు అని, గత పదేళ్లలో తెలంగాణకు రూ. లక్షల కోట్లు ఇచ్చామని, కేంద్రం ఇచ్చిన నిధులు అవినీతి ఎటిఎంలోకి వెళ్లాయని, గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు.

ఆర్‌ఆర్ ట్యాక్స్ విషయంలో తాను ఎవరి పేరు చెప్పలేదని, కానీ సిఎం రేవంత్ రెడ్డి స్పందించటం చూస్తే ఆర్‌ఆర్ ట్యాక్స్ ఎవరు వసూలు చేస్తున్నారో అర్థమవుతోందని చురకలంటించారు. సమాజంలో విషం నింపేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కు హిందువులు, హిందువుల పండుగలు అంటే ఇష్టం లేదని, తాను గుడికి వెళ్తే కూడా దేశ వ్యతిరేకమైన పని అని విమర్శిస్తున్నారని, దేశంలో హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. మతపరమైన రిజర్వేషన్లకు అంబేడ్కర్ కూడా వ్యతిరేకమేనని, కులాల పేరిట, మతాల పేరిట దేశాన్ని విభజించాలని కాంగ్రెస్ చూస్తోందని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News