Friday, January 3, 2025

మార్కెట్ ఫిన్‌ఫ్లూయెన్సర్స్‌ను స్కాన్ చేస్తోన్న సెబీ!

- Advertisement -
- Advertisement -

ముంబై: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఫిన్‌ఫ్యూయెన్సర్‌లు, పోంజీ యాప్‌లపై ప్రకటన చేసిన తర్వాత, మదుపరులు ఫైనాన్స్ ఇన్‌ఫ్లూయెన్సర్‌పై సందేశహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫైనాన్స్ ఇన్‌ఫ్లూయెన్సర్‌లు అందరూ ధృవీకరించబడిన ఆర్థిక సలహాదారులు కాదు. కాగా తమ ఆర్థిక స్థితిని సరిదిద్దుకోవాలని చూసే వ్యక్తులు తరచుగా తాజా ట్రెండ్‌లు, పెట్టుబడి అవకాశాల గురించి తెలుసుకోవడానికి ఇన్‌ఫ్లుయెన్సర్‌లను అనుసరిస్తుంటారు.ఆర్థిక మంత్రి సీతారామన్ ఇటీవల చేసిన ప్రకటన సాధారణ ప్రజల ఆర్థిక నిర్ణయాలపై ఫిన్‌ఫ్లూయెన్సర్‌ల ప్రభావం గురించి పెరుగుతున్న ఆందోళనను సూచిస్తోంది.

గత వారం బెంగళూరులో జరిగిన మేధావుల ఫోరమ్ ఈవెంట్‌లో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ‘సామాజిక ప్రభావశీలులు, ఆర్థిక ప్రభావశీలులు.. అందరూ ఉన్నారు. అయితే మనం రెండు సార్లు తనిఖీ చేయడం, కౌంటర్ చెకింగ్ చేయడం కోసం మనలో ప్రతి ఒక్కరిలో బలమైన జాగ్రత్త అవసరం’ అన్నారు.

యూట్యూబ్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పంప్‌అండ్‌డంప్ స్కీమ్‌లు ప్రబలంగా ఉన్నాయి. ఇందులో చక్రం తిప్పేవారు (పర్‌పేట్రేటర్స్) మదుపరులను ప్రలోభపెట్టి కొనిపిస్తారు, కృత్రిమంగా ధరలను పెంచుతారు. తర్వాత షేర్ల ధర పెరిగాక వాటిని విక్రయించేస్తారు.

పెట్టుబడి సలహాలు తీసుకునే మదుపరులు, సలహా ఇచ్చే వారు సెబీ నమోదిత వ్యక్తా, కాదా అని చూసుకోవాలి. ఇంకా తన స్వంత రీసెర్చ్ చేయాలి. స్టాక్ మార్కెట్‌లో మూలధనాన్ని కాపాడుకోవడం చాలా ప్రధానం. ఎవరు పడితే వారి నుంచి స్టాక్ మార్కెట్ టిప్స్ తీసుకోకూడదు. టిప్స్ ఇచ్చేవారు సెబీ నమోదిత వ్యక్తా, కాదా అన్నది నిర్ధారించుకోవాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News