హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విజయ డైరీ పూర్వ వైభవం వచ్చిందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తెలిపారు. ఎన్ టిఆర్ పార్క్, లుంబినీ పార్క్ ల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన విజయ ఐస్ క్రీమ్ పార్లర్ లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో మంత్రి తలసాని ఆద్వర్యంలో గొర్రెల పంపిణీ చక్కగా జరుగుతుందని, ఇతర రాష్ట్రాల నుంచి మనం ఎందుకు పాల దిగుమతి చేసుకోవాలన్నారు. మనమే ఇతర రాష్ట్రలకు పాలు సప్లయ్ చేయాలని, పాడి రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. రైతులు వ్యవసాయ, అనుబంధంగా ఉన్న పాల ఉత్పత్తి పై దృష్టి సారించాలన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు 60 పార్లర్ ఉంటే ఇప్పుడు 600 పైగా ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య పాల్గొన్నారు.
మనం ఎందుకు పాలు దిగుమతి చేసుకోవాలి: వినోద్ కుమార్
- Advertisement -
- Advertisement -
- Advertisement -