Sunday, December 22, 2024

బిజెపి పాపానికి ప్రజలెందుకు బాధపడాలి? : మమతా బెనర్జీ

- Advertisement -
- Advertisement -

 

Mamata Benrjee

కలకత్తా: బిజెపి మాజీ అధికార ప్రతినిధి ప్రవక్త(స) ముహమ్మద్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘అల్లర్లకు’ కారణమైన రాజకీయ పార్టీలపై విరుచుకుపడ్డారు.
“ నేను ఇదివరకే ప్రస్తావించినట్లు రెండు రోజులుగా హౌరాలో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. దీని వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. వారు అల్లర్లు చేయాలనుకుంటున్నారు. అయితే వీటిని సహించేది లేదు, అందరిపై కఠిన చర్యలు తీసుకుంటాము.
ముహమ్మద్ ప్రవక్త(స)పై సస్పెండైన బిజెపి అధికార ప్రతినిధి నూపుర్ శర్మ, బహిష్కృత నాయకుడు నవీన్ కుమార్ జిందాల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శుక్రవారం హౌరా జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. నిరసన కారులు రాళ్లు రువ్వడం, పోలీసు వాహనాలకు నిప్పు పెట్టడం, ప్రజా ఆస్తులను నష్టపరచడం వంటివాటికి పాల్పడ్డారు. హౌరా జిల్లాలో ఇంటర్నెట్ సేవలను జూన్ 13 వరకు సస్పెండ్ చేశారు. సిఆర్‌పిసి 144 సెక్షన్ కింద జూన్ 15 వరకు ఉలుబేరియా, దోమ్‌జుర్, పంచ్లా ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. రోడ్లను దిగ్భందించడంతో సామాన్యులకు ఇబ్బంది ఏర్పడింది. హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో అనేక లోక్‌ల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News