Monday, January 20, 2025

ఇండియాను తమిళుడు ఎందుకు పాలించకూడదు?

- Advertisement -
- Advertisement -

భారతీయుడు-2 ఆడియో లాంచ్ వేడుకలో కమల్ హాసన్…

చెన్నై: నటుడు కమల్ హాసన్ ‘భారతీయుడు2’ సినిమా ఆడియో లాంచ్ చేశారు. ఈ సినిమా విడుదల చాలా ఆలస్యం అవుతోంది. ఈ ఆడియో లాంచ్ వేడుకలో కమల్ హాసన్ ప్రేక్షకులను ఒకటి ప్రశ్నించారు. అదేమిటంటే ‘తమిళుడు ఇండియాను ఎందుకు పాలించకూడదు?’ అన్నది ఆ ప్రశ్న.

కమల్ హాసన్ ప్రసంగిస్తూ ‘డైరెక్టర్ శంకర్ తన తొలి సినిమా ‘జెంటిల్మన్’ కోసం నా దగ్గరికి వచ్చాడు. కొన్ని క్రియేటివ్ వైరుధ్యాలున్న కారణంగా నేనా సినిమా చేయలేదు. కానీ అప్పుడు నేననుకున్నాను శంకర్ ఇక ఎప్పుడూ నా దగ్గరికి రాడని. ఎందుకంటే ఎవరైనా తన సినిమాను తిరస్కరించిన వ్యక్తి వద్దకు మళ్లీ వెళ్లరు. కానీ జెంటల్మన్ సినిమా విజయవంతం అయ్యాక శంకర్ మరో స్క్రిప్ట్ తో నా దగ్గరకు వచ్చాడు.

నా ‘దేవర్ మగన్’సినిమా విజయవంతం అయ్యాక నేను ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ తో ఓ చిత్రంలో నటించాలనుకున్నాను. ‘ఇండియన్’ సినిమా కథ, నా ప్రాజెక్ట్ తో ఆయన వద్దకు వెళ్లి ఏం చేద్దామన్నాను. అప్పుడు శివాజీ సార్ నాతో ‘ఒరేయ్,  మనం ఇదివరకే తండ్రి, కొడుకులుగా నటించాము. ఈ సినిమాలో తండ్రి,కొడుకుగా నువ్వే చేయి’ అన్నారు. నా మీద వాత్సల్యంతోనే ఆయన అలా అన్నారు. అందుకనే నేను ఈనాడు మీ ముందు ఓ స్థాయిలో నిలుచుని ఉన్నాను’’ అని చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత ‘ఇండియన్ 2’ సినిమా తీస్తున్న లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాష్ కరన్ ధైర్యాన్ని కమల్ హాసన్ మెచ్చుకున్నారు. ఆ తర్వాత కమల్ హాసన్ సినిమాలో నటించిన ఇతర నటుల వద్దకు వెళ్లి మాట్లాడారు.

కమల్ హాసన్ ఇంకా మాట్లాడుతూ ‘‘ నా ఉనికి విషయానికి వస్తే, నేను తమిళుడిని, ఆ తర్వాత భారతీయుడిని. మీ ఉనికి కూడా ఇదే. ఎప్పుడు సహనంతో ఉండాలి, ఎప్పుడు ఉండకూడదో తమిళులకు బాగా తెలుసు. ఒకానొక సందర్భంలో నేను స్టేజి మీద ఒకటన్నాను. ఆ తర్వాత చిక్కులు ఎదుర్కొన్నాను. కానీ ఇప్పుడు నేను వెరవడంలేదు. భారత్ ను తమిళుడు పాలించే రోజు ఎందుకు రాకూడదు? దాని గురించి నేను ఆలోచిస్తున్నాను. మనం(తమిళులం) నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు కె. కామరాజ్ మద్దతుతో ఇందిరా గాంధీని దేశానికి తొలి మహిళా ప్రధానిని చేశాము. కనుక మనం ఓ తమిళుడు దేశాన్ని పాలించే రోజు ఏనాటికైనా తీసుకొస్తాం’’ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News