Monday, December 23, 2024

మహాశివరాత్రి నాడు జాగరణ ఎందుకు..?

- Advertisement -
- Advertisement -

ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణా దులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వం శివస్వరూపంగా భావించి, దర్శించడమే నిజమైన జాగరణం. ఇలా చేస్తే, శివపూజలో సాయు జ్యం, శివభజనలో సామీప్యం, శివభక్తులతో కూడి, శివ విషయాలు ప్రసంగించుటలో సలోక్యం, శివధ్యానంలో సారూప్యం సిద్ధిస్తాయని సాక్షాత్తు జగద్దురువు ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు.

ఖాళీ కడుపులో విషతుల్యమైన ఆమ్లాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అవి శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా ఉండేందుకే ఉపవాసం చేసిన వారికి జాగరణ కూడా ముఖ్యవిధిగా ఏర్పర్చారు. మర్నాడు మితాహారంతో ఉపవాసం విరమించిన తరువాత కూడా వెంటనే నిద్రకు ఉపక్రమించకూడదు. రెండు పొద్దులైనా ఆహారం తీసుకోవాలి. జాగరణం అంటే మన గురించి మనం మేలుకుని ఉండడం.

జాగరణను సంపూర్ణ ఆరోగ్యవంతులే చేయాలి. జాగరణ మర్నాడు విశ్రాంతిగా గడపడం అవసరం. ఉపవాస, జాగరణలు చేసేవారు మితిమీరిన శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. డ్రైవింగ్ వంటి ఏకాగ్రత అత్యవసరం అయ్యే పనులకు విశ్రాంతి తరువాతే ఉపక్రమించండి. జాగరణ సమయంలో మానసిక ఉద్వేగాలను పెంచే వినోద కార్యక్రమాలకు దూరంగా ఉండాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News