Monday, December 23, 2024

తొలి టెస్టు: కష్టాల్లో వెస్టిండీస్..

- Advertisement -
- Advertisement -

డొమినికా: భారత్‌తో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ మొదటి రోజు లంచ్ విరామ సమయానికి 28 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. రవిచంద్రన్ అశ్విన్ అద్భుత బౌలింగ్‌తో విండీస్ ఓపెనర్లను బ్రాత్‌వైట్, త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్‌ను పెవిలియన్ పంపించాడు.

కెప్టెన్ బ్రాత్‌వైట్ 20 పరుగులు చేశాడు. చందర్‌పాల్ 12 పరుగులకే వెనుదిరిగాడు. వన్ డౌన్‌లో వచ్చిన రేమన్ రిఫర్ (2) కూడా విఫలమయ్యాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన బ్లాక్‌వుడ్ (14) కూడా నిరాశ పరిచాడు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు, శార్దూల్, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో భారత యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ టెస్టు క్రికెట్‌కు శ్రీకారం చుట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News