Thursday, December 26, 2024

టి20లో ఆస్ట్రేలియాపై విండీస్ రికార్డు విజయం

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన టి20 మ్యాచ్‌లో వెస్టిండీస్ మహిళల టీమ్ రికార్డు విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఎలిసె పేరి (70), లిచ్‌ఫీల్డ్ 52 (నాటౌట్) విధ్వంసక ఇన్నింగ్స్‌లతో చెలరేగారు.

ఈ క్రమంలో లిచ్‌ఫీల్డ్ 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 19.5 ఓవర్లలో 3 వికెట్లకు 213 పరుగులు చేసి రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. మహిళల టి20లో ఇదే రికార్డు ఛేదన కావడం విశేషం. కెప్టెన్ హేలీ మాథ్యూస్ 64 బంతుల్లోనే 132 పరుగులు చేసి విండీస్‌కు రికార్డు విజయాన్ని అందించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News