Thursday, March 6, 2025

ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ఎస్‌ఆర్‌హెచ్‌లోకి సఫారీ ఆల్‌రౌండర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఇండియాన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ కోసం ఇప్పటినుంచే అన్ని జట్లు కసరత్తును ప్రారంభించాయి. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టోర్నీ ఆరంభానికి ముందే ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఇంగ్లండ్ ఆడగాడు బ్రైడన్ కార్సే స్థానంలో సఫారీ ఆల్ రౌండర్ వియాన్ ముల్డర్‌ని జట్టులోకి తీసుకుంటున్నట్లు జట్టు గురువారం ప్రకటించింది.

ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో కార్సేను ఎస్‌ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. అయితే కార్సే బొటనవేలుకు తీవ్ర గాయం కావడంతో అతను సీజన్ మొత్తనికి దూరం కావాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో అతని స్థానంలో వియాన్ ముల్డర్‌‌ని జట్టులోకి తీసుకున్నారు. 27 సంవత్సరాల ముల్డర్ పేస్ బౌలింగ్‌తో పాటు.. కుడి చేతివాటం బ్యాటర్ కూడా. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌తో కేన్ విలియమ్‌సన్ వికెట్ తీసిన ముల్డర్.. బ్యాటింగ్‌లో మాత్రం విఫలమయ్యాడు. 13 బంతులు ఎదురుకొని కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు ఇదే అతని మొదటి ఐపీఎల్ కావడం మరో విశేషం మరి ఐపీఎల్‌లో ఇతని ఎంపిక ఎస్‌ఆర్‌హెచ్‌కు ఎంత కలిసి వస్తుందో వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News