Wednesday, January 22, 2025

ఈవీఎం, వీవీప్యాట్ వినియోగంపై విస్తృత ప్రచారం చేయాలి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: జిల్లా వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్‌ల వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఈవీఎం, వీవీప్యాట్ అవగాహన కేంద్రాన్ని ఆయన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రియాంకతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.

అనంతరం వీటి అవగాహన, శిక్షణకు ఏర్పాటు చేసిన మూడు ప్రచార రథాలను వారు జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో ముఖ్యమైన ప్రదేశాలలో విస్తృతంగా అవగాహన కల్పించనున్నట్లు, ఈవీఎం, వీవీప్యాట్ వినియోగించుకొని ఓటు ఎలా వేయాలనే దానిపై ప్రచారం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్, మంథని డివిజన్ అడ్మినిస్ట్రేషన్ అధికారి తూము రవీందర్, ఎన్నికల డీటీ ప్రవీణ్, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News