Friday, November 15, 2024

ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

- Advertisement -
- Advertisement -

Widespread Rains in the TS state

చల్లబడ్డ వాతావరణం
హైదరబాద్ కూల్ కూల్
మధోల్‌లో 78 మి.మి వర్షం

మనతెలంగాణ/హైదరాబాద్ : ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉరుములు ,మెరుపులు ఈదురుగాలులతో వడగండ్ల వానలు కురిశాయి. సోమవారం నాడు ఆకాశం మేఘావృతంగా మారి వాతావరణం ఒక్కసారిగి చల్లబడింది. రాష్ట్రంలో అత్యధికంగా నిర్మల్ జిల్లా మధోల్‌లో 78.4 మి.మి వర్షం కురిసింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో 65, బాసరలో 57, పాల్వంచలో 49.2, మొగుళ్లపల్లిలో 44.2,భీమదేవరపల్లిలో 38.2, బూర్గంపహాడ్‌లో 33.8,ధర్‌పల్లిలో 33.6,ఇల్లెందులో 32.2, బోధ్‌లో 31.6, వెంకటాపురంలో 26, గుండాలలో 24.8,మెట్‌పల్లిలో 24.4, డిచ్‌పల్లిలో 19.2,భీమ్‌గల్‌లో 14.8, పినకపాలలో 14.4,కమ్మరపల్లిలో 13.2,ధర్మాసాగర్‌లో 12.8, నిజామాబాద్‌లో 11.6, హసన్‌పర్తిలో 11.6, నవీపేట, భద్రాచలం, తాడ్వాయ్ కేంద్రాల్లో 11 మి.మి వంతున వర్షం కురిసింది.

నందిపేట, మక్లూర్, మల్లులపల్లి, వర్ని, సారంగపూర్, దిల్వార్ పూర్, భూపల్ పల్లి, కోట్గిరి , జక్రాన్‌పల్లి, పరకాల్ ,బోధన్ , హన్మకొండ, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా తుంపర్లు పడ్డాయి. మరో వైపు పలు ప్రాంతాల్లో ఎండలు కూడా తీవ్రంగానే ఉన్నాయి. రాష్ట్రంలో పగటి ఉష్ణగ్రతలు పరిశీలిస్తే అత్యధికంగా మెదక్‌లో 42డిగ్రీలు నమోదైంది. నల్లగొండలో 40, రామగుండంలో 39.8, మహబూబ్‌నగరలో 38, భద్రాచలంలో 38.2, హైదరాబాద్‌లో 36, అదిలాబాద్‌లో 36.8, హకీంపేటలో 34డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరో మూడు రోజులు వర్షాలు:

దక్షిణ మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఉపరితల ఆవర్తనం ఇంటీరియర్ కర్ణాటక దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9కి.మి ఎత్తున కొనసాగుతోంది.దీని ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు , ఈదురుగాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

హైదరాబాద్ కూల్ ..కూల్

ఉన్నట్టుండి వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. కోఠి, బేగంపేట, సికింద్రాబాద్ , అమీర్‌పేట్ , జూబ్లిహిల్స్ , తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచే వాతావరణం చల్లబడటంతో నగర ప్రజలు హాయిగా సేదదీరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News