Tuesday, January 21, 2025

మరో పెళ్లి చేసుకోకుండా.. భర్తపై యాసిడ్ దాడి

- Advertisement -
- Advertisement -

భర్త మరో పెళ్లి చేసుకోకుండా ఓ భార్య యాసిడ్ దాడి చేసిన సంఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో బుధవారం చోటుచేసుకుంది. ఎర్డండికి చేందిన నిరేటి మహేశ్‌కు, లక్షణతో వివాహం జరిగింది. ఇద్దరు మధ్య తరుచూ మనస్పర్థలతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 11 అక్టోబర్ 2023న విడాకులు తీసుకున్నారు. అప్పటి వరకు అంతా బానే ఉంది. మహేశ్ మరో వివాహం చేసుకునేందుకు సిద్దం అయ్యాడు. అందుకు గానూ ఏర్పాట్లు చేస్తుండగా అతనికి పెళ్లి కాకుండా ఉండేందుకు మాజీ భార్య యాసిడ్ బాటిల్‌తో దాడి చేసింది. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు లక్షణపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News