బివానీ: హరియాణలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అసభ్యకరంగా వేరే మనిషితో భర్తకు దొరికి పోయి.. నిలదీసినందుకు అతన్నే దారుణంగా హత్య చేసింది ఓ భార్య. వివరాల్లోకి వెళితే.. హరియాణాలోని బభివానికి చెందిన ప్రవీణ్(35)కి, రవీనాతో 2017లో వివాహమైంది. రవీనా యూట్యూబ్‌లో వీడియోలు చేసేది. కుటుంబసభ్యులు ఎంత వద్దన్న ఆమె వినేది కాదు. ఈ విషయంలో రవీనాకు, ప్రవీణ్ మధ్య చాలాసార్లు గొడవలు కూడా జరిగేవి. అయితే రెండున్నర ఏళ్ల క్రితం ఇ్రన్‌స్టాగ్రామ్‌లో సురేశ్‌తో పరిచయమైంది. కొన్ని రోజుల తర్వాత అది వివాహేతర సంబంధానికి దారి తీసింది.
అయితే గతనెల 25న సురేశ్, రవీనా అసభ్యకర పరిస్థితిలో ఉండగా..ప్రవీణ్‌కి దొరికిపోయారు. దీంతో అతను వారిని నిలదీశాడు. ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగింది. ఇదికాస్త పెరిగిపోయి.. ప్రవీణ్‌ని గొంతు కోసి హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని బైక్‌పై తీసుకువెళ్లి.. కాలువలో పడేశారు. ప్రవీణ్ గురించి కుటుంబసభ్యులు అడిగితే.. రవీనా తెలియదనే చెప్పేది. కానీ అనుమానం వచ్చి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులకు దర్యాప్తు చేపట్టగా.. మూడు రోజుల తర్వాత కాలువలో ప్రవీణ్ మృతదేహం దొరికింది. అక్కడి సిసిటివిలో జరిగిందంతా రికార్డ్ అయింది. దీంతో పోలీసులు రవీనాను అదుపులోకి తీసుకొని విచారించగా.. ఆమె నేరాన్ని అంగీకరించింది. కాగా, పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న యూట్యూబర్ సురేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.