Thursday, March 20, 2025

భర్తను చంపి.. ముక్కలుగా నరికి.. సిమెంట్‌ వేసి ప్యాక్ చేసి..

- Advertisement -
- Advertisement -

మీరట్: తన కూతురు పుట్టిన రోజు వేడుకల కోసం విదేశాల నుంచి ఇంటికి వచ్చిన భర్తను.. తన ప్రియుడితో కలిసి భార్య హత్య చేసి.. ముక్కలుగా చేసి సిమెంట్ వేసి ప్యాక్ చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మీరట్‌లోని బ్రహ్మపురి ఇంద్రానగర్ ఫేజ్ 2కి చెందిన సౌరభ్ కుమార్‌ 2016లో గౌరీపురానికి చెందిన ముస్కాన్ రస్తోగిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే తాను భార్యతో కలిసి ఉండటం కోసం తన మర్చెంట్ నేవీ ఉద్యోగాన్ని వదిలేశాడు సౌరభ్. ఈ విషయం అతని కుటుంబసభ్యులకు నచ్చకపోవడంతో సౌరభ్ తన భార్యతో కలిసి వేరే కాపురం పెట్టాడు. 2019లో వీరికి కూతురు పుట్టింది. అయితే అంతకు ముందే ముస్కాన్‌కి సాహిల్ శుక్లా అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని సౌరభ్‌కు తెలిసింది. దీంతో వీరిద్దరు విడాకుల వరకూ వెళ్లారు. కానీ, కూతురి భవిష్యత్తు గురించి ఆలోచించి సౌరభ్ మళ్లీ 2023లో మర్చెంట్ నేవీ ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో అతను దేశం వదలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

కూతురి పుట్టిన రోజు కోసం ఫిబ్రవరి 24వ తేదీన సౌరభ్ భారత్‌కు వచ్చాడు. కానీ, అప్పటికే ప్రేమలో చాలా దూరం వెళ్లిన ముస్కాన్, సాహిల్.. సౌరభ్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. మార్చి 4వ తేదీన ముస్కాన్ సౌరభ్ తినే ఆహారంలో మత్తుమందు కలిపింది. దీంతో అతను గాఢనిద్రలోకి జారుకోగానే సాహిల్ కత్తితో హత్య చేశాడు. ఆ తర్వాత శరీరాన్ని 15 భాగాలుగా నరికి ఓ డ్రమ్ములో వేసి.. సిమెంట్‌తో దాన్ని సీల్ చేశారు.

సౌరభ్ గురించి చుట్టుపక్కల వాళ్లు ప్రశ్నిస్తారని.. తన భర్తతో కలిసి టూర్‌కి వెళ్తున్నట్లు చెప్పి.. ప్రియుడితో కలిసి వెళ్లింది. అయితే ఎన్నిరోజులైన సౌరభ్ ఫోన్ ఎత్తకపోవడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముస్కాన్, సాహిల్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా.. వాళ్లు చేసిన దారుణాన్ని బయటపెట్టారు. పోలీసులు ఆ డ్రమ్‌లోని సిమెంట్‌ను బద్దలుగొట్టి సౌరభ్ శరీర భాగాలను బయటకు తీసి పోస్ట్ మార్టంకు తరలించారు. ముస్కాన్, సాహిల్‌లను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News