Sunday, January 19, 2025

ఈయన భార్యతో ఆయన లేచిపోతే… ఆయన భార్యను ఈయన పెళ్లి చేసుకున్నాడు

- Advertisement -
- Advertisement -

పాట్నా: ఓ వ్యక్తి మరొ వ్యక్తి భార్యతో లేచిపోగా… నిందితుడి భార్యను బాధితుడు పెళ్లి చేసుకున్న సంఘటన బిహార్ రాష్ట్రం ఖగాఢియా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. హార్డియా గ్రామంలో ముఖేష్ తన భార్య రూబీతో కలిసి కూలీ పనులు చేస్తుంటాడు. అదే గ్రామంలో నీరజ్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన భార్య రూబీతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ముఖేష్ అనే వ్యక్తి నీరజ్ భార్యతో లేచిపోయాడు. దీంతో ముఖేష్ భార్యను నీరజ్ పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు భార్యల పేర్లు రూబీయే కావడం గమనార్హం.

రూబీకి ముఖేష్‌తో పరిచయం ఉన్నప్పటికి నీరజ్‌ను పెళ్లి చేసుకుంది. వివాహం జరిగిన తరువాత రూబీతో ముఖేష్ ప్రేమాయణం కొనసాగించాడు. ముఖేష్‌కు గతంలో రూబీ అనే మరో అమ్మాయితో పెళ్లి జరగింది. నీరజ్ భార్యతో ముఖేష్ పారిపోవడంతో పెద్దలు పంచాయతీ పెట్టారు. తన ప్రియురాలిని వదిలిపెట్టనని ముఖేష్ చెప్పాడు. దీంతో ముఖేష్ భార్యతో నీరజ్ స్నేహం చేశాడు. తాజాగా ముఖేష్ భార్యను నీరజ్ ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News