Sunday, December 22, 2024

శృంగారం చేస్తుండగా భర్తకు కనిపించడంతో… అతడిని చంపి..

- Advertisement -
- Advertisement -

జైపూర్: భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపి కాలువలో మృతదేహాన్ని పడేసిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం భరత్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఏడు సంవత్సరాల క్రితం పవన్ అనే యువకుడు రీమాను పెళ్లి చేసుకున్నాడు. రీమా పక్కింట్లో ఉండే భగేంద్రతో వివాహేతర సంబంధ పెట్టుకుంది. మే 29న భగేంద్ర తన స్నేహితుడు దీప్‌తో కలిసి రీమా ఇంటికి వెళ్లారు. దీప్ బయట ఉండగా భగేంద్ర, రీమాతో కలిసి ఇంట్లోకి వెళ్లారు. అదే సమయంలో పవన్ కూడా ఇంట్లోనే నిద్రిస్తున్నాడు. రీమా-భగేంద్ర శృంగారంలో ఉండగా పవన్ గమనించాడు. వెంటనే భగేంద్రను పట్టుకున్నాడు. రీమా-భగ్రేంద్ర కలిసి పవన్ గొంతు నులిమి హత్య చేశారు.

అనంతరం మృతదేహాన్ని బస్తాలో మూటకట్టి రెండు కిలో మీటర్ల దూరంలో కాలువలో పడేశారు. పవన్ తండ్రి హరిప్రసాద్ తన కుమారుడు కనిపించడంలేదని చిక్సాన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. భార్యను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తనకు తెలియదని ఆమె తెలిపింది. అక్టోబర్‌లో తన ప్రియుడితో కలిసి రీమా శృంగారం చేస్తుండగా హరిప్రసాద్ కంట్లో పడింది. వెంటనే అతడు తన కుమారుడిని వీళ్లు ఇద్దరే చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News