Wednesday, January 22, 2025

భార్య, అత్తను కత్తితో పొడిచి… ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

Wife and Mother in law murder by Son in law

అమరావతి: భార్య, అత్తను హత్య చేసిన అనంతరం కత్తితో అతడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముద్దాడ పేటలో తన కుటుంబంతో కలిసి అప్పన్న వ్యక్తి జీవిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి భార్యతో పాటు అత్తింటి వారితో గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో కత్తి తీసుకొని భార్య, అత్తను పొడిచి చంపేసిన అనంతరం మరో ముగ్గురిపై దాడి చేశాడు. అనంతరం కత్తి తీసుకొని పొడుచుకున్నాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News