Friday, January 3, 2025

ఫోన్ తెచ్చిన తంటా… భర్త కంట్లో కత్తెరతో పొడిచిన భార్య

- Advertisement -
- Advertisement -

లక్నో: ఫోన్ ఇవ్వమని అడిగినందుకు భర్త కంట్లో భార్య కత్తెరతో పొడిచిన సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అంకిత్-ప్రియాంక అనే దంపతులు బాగ్‌పత్‌లో నివసిస్తున్నారు. యూ ట్యూబ్‌లో పాటలు వింటానని తనకు ఫోన్ ఇవ్వాలని భార్యను భర్త అడిగాడు. ఆమె తన ఫోన్ తీసుకొని పాటలు వినాలని సూచించడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో కత్తెర తీసుకొని అంకిత్ కంటిలో ప్రియాంక పొడిచింది. వెంటనే బాధితుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News