Saturday, December 21, 2024

హన్మకొండలో దారుణం.. పెళ్లైన నెల రోజులకే భర్త గొంతు కోసిన భార్య..

- Advertisement -
- Advertisement -

హన్మకొండ: ఓ భార్య తన భర్త గొంతు కోసిన దారుణ ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని దామెర మండలం పసరగొండకు చెందిన రాజు, అర్చన దంపతులకు నెల రోజుల క్రితమే వివాహం జరిగింది. అయితే, కొద్దిరోజులుగా భార్యభర్తల మధ్య తలెత్తిన వివాదాలు గొడవకు దారి తీశాయి. ఈ క్రమంలోనే కోపంతో రగిలిపోయిన భార్య బ్లేడుతో భర్త గొంతు కోసింది. దీంతో భర్త అరుపులు విన్న చుట్టు ప్రక్కల వారు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన భర్తను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Wife attack on Husband with blade in Hanamkonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News