Monday, November 18, 2024

వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసి…

- Advertisement -
- Advertisement -

wife bathing viral husband commits suicide in AP

అమరావతి: భార్య స్నానం చేస్తుండగా తీసిన వీడియో వైరల్ కావడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని ఎ.సీతారాంపురంలో చోటుచేసుకుంది. సీతారాంపురం గ్రామానికి చెందిన వివాహిత స్నానం చేస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన జయబాబు అనే వ్యక్తి వీడియో తీశాడు. అనంతరం దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అదికాస్త వైరల్ అయింది. విషయం తెలుసుకున్న సదురు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగానే ఆమె భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. జయబాబు వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, ఇప్పుడు తన కుటుంబానికి దిక్కేవరని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం చేయాలని పోలీసులను డిమాండ్ చేస్తుంది. పోలీసులను ఆశ్రయించినందుకు బాధితురాలి భర్తను నిందితుడు జయబాబు చంపుతానని బెదిరించినట్టు స్థానికులు తెలిపారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

wife bathing viral husband commits suicide in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News