Saturday, December 21, 2024

ప్రభుత్వోద్యోగుల మధ్య వివాహేతర సంబంధం… రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

- Advertisement -
- Advertisement -

Husband suicide with lover elope

వరంగల్: ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్త ప్రియురాలుతో చనువుగా ఉన్నప్పుడు భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సంఘటన వరంగల్ జిల్లా కేంద్రంలోని పైడిపలిలోని ఆర్‌టిసి కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవన్ అనే వ్యక్తి వరంగల్ కార్పొరేషన్‌లో సూపరింటెండెంట్‌గా పని చేశాడు. అదే కార్యాలయంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్యను చిత్రహింసలకు గురి చేయడంతో కట్నం కోసం ఆమెను వేధిస్తున్నాడు. భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని భార్య తెలుసుకుంది. వెంటనే వాళ్లను పట్టుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఉదయం భర్త సదరు ప్రియురాలు ఇంటికి వెళ్లాడు. అతడి వెనకాలే వెళ్లిన భార్య వారు గదిలో ఉండగా గడియపెట్టి పోలీసులు, బంధువులకు సమాచారం ఇచ్చింది. ఆమె తరుపు బంధువులు జీవన్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతడిని భార్య చెప్పుతో చితకబాదింది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News