Thursday, January 23, 2025

భర్త స్నేహితుడు వేధింపులు… భార్య ఆత్మహత్య…

- Advertisement -
- Advertisement -

Wife commit suicide in Mancherial

మంచిర్యాల: భర్త స్నేహితుడి వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముత్యంపేటలో గ్రామంలో మౌనిక(24) తన భర్తతో కలిసి జీవిస్తోంది. భర్త స్నేహితుడు మొటపల్కుల ప్రశాంత్ (28) గత కొన్ని రోజుల నుంచి ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. ఫోన్‌లో పలుమార్లు వేధింపులకు గురిచేశాడు. వేధింపులు శృతిమించడంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. అత్త, భర్త, తల్లి ఆరుబయట మాట్లాడుకుంటుండగా మౌనిక పురుగుల మందు తాగి వాంతులు చేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. మౌనికకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అవమానంగా భావించిన ప్రశాంత్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News