Friday, December 27, 2024

ప్రేమ పెళ్లి… సినిమాకు తీసుకెళ్లలేదని భార్య ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: ప్రేమించారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు… భార్యను భర్త సినిమాకు తీసుకెళ్లలేదని ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగెం గ్రామానికి చెంది రాజు(22), స్వాతి(20) గాఢంగా ప్రేమించుకున్నారు. స్వాతి కుటుంబ సభ్యులను ఎదురించి రాజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తరువాత ఇరువైపులా కుటుంబాలను ఒప్పించారు. శంకర్‌పల్లిలోని భవానీనగర్‌లో రాజు-స్వాతి దంపతులు గది అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. బుధవారం రాత్రి సెకండ్ షో సినిమాకు తీసుకెళ్లాలని భార్య కోరగా రాజు నిరాకరించాడు. మనస్థాపం చెందిన స్వాతి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్న స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ సంతోష్ రెడ్డి తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News