Saturday, November 23, 2024

భర్త వేధింపులు… ఐదుగురు పిల్లలతో కలిసి బావిలో దూకిన తల్లి

- Advertisement -
- Advertisement -

Wife commit suicide with children

జైపూర్: భర్త వేధింపులు తట్టుకోలేక భార్య తన ఐదుగురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజస్థాన్ రాష్ట్రం కోటా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శివలాల్ (45), బాదం దేవి(40) అనే దంపతులు కాలియా ఖేడీ గ్రామంలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఏడుగురు పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగతున్నాయి. భర్త ఎక్కువగా వేధిస్తుండడంతో బాదందేవి చనిపోవాలని నిర్ణయం తీసుకుంది. భర్త బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు ఆమె తన ఐదుగురు పిల్లలతో గ్రామశివారులో ఉన్న బావిలో దూకింది. బావిలో శవాలు తేలడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News