Monday, December 23, 2024

భర్త మృతి తట్టుకోలేక భార్య ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి : గుండెపోటుతో భర్త మరణించగా, ఆయన మరణం తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మొరంచపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. భూపాలపల్లి ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. మొరంచపల్లి గ్రామానికి చెందిన చుక్క సారయ్య (65), చుక్క కవిత (55) సారయ్యకు రెండవ భార్య ఈమె మొదటి భార్య బతికుండగానే పెళ్ళి చేసి ఆమె ఎటో వెళ్లిపోయింది.

సారయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. భార్య, పిల్లలు, కూతురు మొరంచపల్లిలో ఉంటున్నారు. చిన్న కుమారుడు ఫ్యామిలీతో మంజునగర్‌లో ఉంటున్నారు. మరణించిన డెడ్ బాడీలను పోస్టుమార్టం నిమిత్తం 100 పడకల ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు భూపాలపల్లి ఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News