Thursday, January 23, 2025

భర్త పీక కోసిన భార్య

- Advertisement -
- Advertisement -

Wife cut husband throat in Andhra

అమరావతి: భర్త గొంతు కోసి హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా రేణిగుంటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రవి చంద్ర(55), వసుంధర అనే దంపతులు బుగ్గవీధిలో నివసిస్తున్నారు. గురువారం ఉదయం దంపతులు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారా స్థాయికి చేరుకోవడంతో భర్త గొంతును భార్య కోసి చంపేసింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని ఇరుగుపొరుగు వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News