రంగారెడ్డి: భార్య మృతదేహాన్ని నగ్నంగా దుప్పట్లో చుట్టి చెరువులో పడేస్తుండగా స్థానికులు గుర్తించిన సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలంలో జరిగింది. పోలీసులు భర్తను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హయత్‌నగర్ మండల కేంద్రంలోని హనుమాన్ మందిరం సమీపంలో డేగ శ్రీను(35), భార్య లక్ష్మీ(30) అనే దంపతులు తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. శ్రీను తన భార్య మృతదేహాన్ని నగ్నంగా దుప్పట్లో చుట్టి తన స్నేహితుడు వినోద్‌తో కలిసి చెరువులో పడేస్తుండగా స్థానికులు గమనించి వారిని పట్టుకున్నారు. అంత్యక్రియలు చేయడానికి తన వద్ద డబ్బులు లేకపోవడంతో తన భార్య మృతదేహాన్ని పడిసేందుకు వచ్చానని తెలిపాడు. స్థానికులు సమాచారం మేరకు సిఐ సురేందర్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. శ్రీనును అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అనారోగ్యంతో చనిపోయిందని సమాధానం ఇచ్చాడు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించామని సిఐ సురేందర్ తెలిపారు. భార్యను భర్త హత్య చేసి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
భార్య మృతదేహాన్ని నగ్నంగా దుప్పట్లో చుట్టి చెరువులో పడేస్తుండగా…
- Advertisement -
- Advertisement -
- Advertisement -