Monday, December 23, 2024

భర్త ఇంట్లో భార్య శవం… లవరే చంపాడని…

- Advertisement -
- Advertisement -

Driver love affair with Minister's daughter in TN

బెంగళూరు: భర్త ఇంట్లో భార్య హత్యకు గురికావడంతో ఆమె ప్రియుడే హత్య చేశాడని భర్త స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన కర్నాటక బళ్లారి నగరం హంద్రాళ కాలనీలో జరిగింది. అత్తింటి వారే చంపారని మృతురాలు కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆధోనిలో సునీతా అనే యువతి నివిసిస్తోంది. ఆమె పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. కర్నాటకలోని బళ్లారి ప్రాంతం హంద్రా కాలనీలోని డిసి క్యాంపులో సురేష్ అనే యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. సునీత అత్తింటి నుంచి అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్లి వస్తుంది. వివాహం జరిగిన మరుసటి రోజు నుంచి అదోరకంగా ఉండడంతో పలుమార్లు భర్త అడిగాడు.  ఇళ్లు కొత్తది కావడంతో ఆమె ముభావంగా ఉంటుందని భర్త అనుకున్నాడు. ఒక రోజు అత్తింట్లో సునీతో శవంగా కనిపించింది. అల్లుడు, అత్తింటి వారు తమ కూతురును హత్య చేశారని మృతురాలు తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఆమె ప్రియుడు మూర్తి సునీతను హత్య చేశాడని అత్తింటి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. సునీత హత్య జరిగినప్పటి నుంచి మూర్తి కనిపించడంలేదని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Husband suicide with lover elope

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News