Monday, December 30, 2024

భార్య మృతదేహాన్ని పొదల్లో పడేసి…. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు…

- Advertisement -
- Advertisement -

లక్నో: భార్యను చంపి మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసి ఎస్‌పి ఎదుట భర్త లొంగిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సద్దామ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి టోనికా సిటీ ప్రాంతంలో నివసిస్తున్నాడు. భార్యపై సద్దామ్ కు అనుమానం ఉండేది. దీంతో ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పదునైన కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం నడుచుకుంటూ వెళ్లి తన భార్యను చంపేశానని ఎస్‌పి ఇరాజ్ రాజు ఎదుట లొంగిపోయాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సద్దామ్ మరో వ్యక్తితో కలిసి భార్యను చంపినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News