Monday, December 23, 2024

బైక్‌ను ఢీకొట్టిన లారీ: భార్య మృతి.. తీవ్రంగా గాయపడిన భర్త

- Advertisement -
- Advertisement -

Wife dead in Lorry collided bike

హైదరాబాద్: బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందిన సంఘటన మేడ్చల్ జిల్లా సుతారిగూడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రేష్మాబేగం, ఉమర్ అనే దంపతులు బైక్‌పై గండిమైసమ్మ నుంచి మేడ్చల్ వెళ్తుండగా సుతారిగూడ వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. భార్య ఘటనా స్థలంలోనే చనిపోగా భర్త తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News