Saturday, December 21, 2024

భర్త మృతదేహం రాక ముందే భార్య మృతి

- Advertisement -
- Advertisement -

గల్ఫ్‌లో వలస
కార్మికుడు దుర్మరణం
25 రోజులు దాటినా
ఇంటికి చేరని మృతదేహం
కన్నీరుమున్నీరుగా విలవిస్తున్న పిల్లలు
చందాలను పొగు చేసి దహన
సంస్కారాలను జరిపిన గ్రామస్థులు

Wife dead over husband death

మన తెలంగాణ/ఇల్లంతకుంట: విధి వారి కుటుంబాన్ని వక్రీకరించింది. ఉన్న ఊరిలో ఉపాధిలేక పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ వెళ్లిన వలస కార్మికుడు హఠన్మారణం చెందగా, భర్త మరణ వార్త విని భార్య అనారోగ్యంతో, భర్త మృతదేహం రాకముందే మృత్యువాతపడ్డ హృదయ విధారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో చోటు చేసుకుంది. వల్లంపట్ల గ్రామానికి చెందిన నాయిని రాజారాం(52) 22 ఏళ్లుగా ఉపాధి కోసం గల్ఫ్‌లో ఉంటున్నాడు. రాజారాంకు భార్య దేవేంద్ర(48), ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు. 6 నెలల క్రితం పెద్ద కుమార్తె వివాహం కోసం ఎకరం భూమి అమ్మి పెండ్లి చేశాడు. తిరిగి గల్ఫ్‌కు వెళ్లాడు. గల్ఫ్‌లో ప నిచేస్తుండగా జూలై 10న గుండెపోటుతో రాజా రాం మృతి చెందాడు. ఆ మరణా వార్త విన్న కుటుంబసభ్యులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న మృతుడి భార్య దేవేంద్ర మరణ వార్త విని ఆగస్టు 1న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త మృత దేహం ఇంటికి చేరక ముందే భర్త మృతి చెందడంతో ఆ కుంటుంబంలో విషాధఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులను కో ల్పోవడం తో కూతుర్లు, కొడుకు కన్నీరు మున్నీరు గా విలపిస్తున్నారు. పేద కుటుంబం కావడంతో గ్రామం లో చందాలు పొగు చేసి మృతురాలి అంత్యక్రియలు జరిపించారు.

కెటిఆర్ సార్ మా తండ్రి మృతదేహాన్ని తెప్పించండి ప్లీజ్…

కెటిఆర్ సార్.. మా అమ్మ నాన్నలను ఇద్దరిని పో గొట్టుకున్నం.. మేం అనాథలుగా మారాం, ప్లీజ్ సార్ మా నాన్న మృతదేహాన్ని గల్ఫ్ నుంచి తెప్పించండి.. అంటూ మృతుడి కుమార్తెలు, కొడుకు ప్రాధేయపడుతున్నారు. వెంటనే ప్రభుత్వం, అధికారులు, స్పందించి మృతదేహాన్ని ఇంటికి తెప్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News