Sunday, December 22, 2024

ఐదు రోజులుగా భర్త అంత్యక్రియలను నిర్వహించని భార్య

- Advertisement -
- Advertisement -

ఆస్తిలో వాటా కోసం భర్త మృతదేహానికి ఐదు రోజులుగా అంత్యక్రియలు నిర్వహించలేదు ఓ భార్య ఈ ఘటన సదాశివపేట (మం) తంగేడుపల్లిలో చోటు చేసుకుంది. మనుషులు ఇంత దారుణంగా ఉంటారా అన్న దానికి ఇదే నిదర్శనం. పూర్తి వివరాల్లోకి వెళితే తన భర్త ఐదు రోజుల క్రితం చనిపోయాడు. అయితే.. అప్పటి నుంచి ఆస్తిలో వాటా కోసం భర్త మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించలేదు ఓ భార్య.. కాగా, తల్లిదండ్రులు ఆస్తిని మొత్తం తన బావ పేరుపై రిజిస్ట్రేషన్ చేశారని మనస్తాపంతో ఈ నెల 18న భర్త రాములు ఆత్మహత్య చేసు కున్నాడు.

అప్పటి నుంచి సదాశివపేట ఆస్పత్రి మార్చురీలోనే మృతదేహం ఉంది. భార్య బంధువులు ఆస్తిలో వాటా ఇవ్వాలని నిలదీయగా ముందు ఒప్పుకొని తర్వాత అల్లుడు మల్లేశం పరారయ్యాడు.. అతను కొండాపూర్ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఐదు రోజులుగా పోలీ సులు మల్లేశంని రహస్య ప్రదేశంలో దాచిపెట్టారని మృతుడి భార్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News